Global Vaartha
Date of Publish : 03/11/2026, 5:51 pm
Editor : భవ్య జర్నలిస్ట్

నెల్లూరు కార్పొరేషన్‌లో కూటమి విజయదుందుభి

  • డివిజన్లలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం.. ప్రత్యర్థులకు ఎదురుదెబ్బ
  • గోమతి నగర్‌ క్యాంపు కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు
  • మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి దంపతుల సందడి

గ్లోబల్ వార్త- నెల్లూరు : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు ఆధిక్యం ప్రదర్శించాయి. పలు డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ ఫలితాల నేపథ్యంలో గోమతి నగర్‌లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో రాష్ట్ర మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ పాల్గొన్నారు. మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు రామదేవి, కుమార్తెలు షరిణి, సింధు కూడా వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. టీడీపీ విజయోత్సవ గీతాలతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పసుపు జెండాలు, పార్టీ నినాదాలతో కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save