Date of Publish : 05/11/2026, 6:50 am
Editor : భవ్య జర్నలిస్ట్
ఎన్నికల బరిలో గెలుపు ఓటమిలు సహజం
- పరాజితులను పరామర్శించిన తూగుట్ల మధుసూదన్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పురపోరులో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని పరాజయం పాలైన అభ్యర్థులను పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు అభ్యర్థి శివ మరియు 6వ వార్డు బాలుడు తదితరులను 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తూగుట్ల మధుసూదన్ రెడ్డి వారి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమితో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ఈ కష్టసమయంలో వారి కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. రాజకీయాలకు అతీతంగా ఆప్యాయత, ఆత్మీయతతో మీకు ఎల్లప్పుడూ మేమున్నామనే నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజాసేవలో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని, మనుషుల మధ్య బంధాలు ముఖ్యం… పదవులు, గెలుపోటములు కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.