Date of Publish : 05/11/2026, 6:52 am
Editor : భవ్య జర్నలిస్ట్
దీక్షా సమయంలో నియమాలను భక్తిశ్రద్ధలతో పాటించాలి
- అయ్యప్ప ఆలయంలో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు
- గురు స్వామి వెంకట్రామిరెడ్డి
అయ్యప్ప ఆలయంలో బుధవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకం అన్నదాన కార్యక్రమాలతో కూడిన విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా స్వామివారికి గురు స్వామి వెంకటరామిరెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు పుష్పెంద్ర గౌతమ్ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, అష్టోత్తరం అనంతరం ప్రత్యేక అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వగా అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం ధ్వనించింది. ఈ సందర్భంగా గురుస్వామి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ దీక్షా సమయంలో కఠినమైన నియమాలను భక్తిశ్రద్ధలతో మరియు నిబద్ధతతో ఆచరించడం ద్వారానే స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ఆధ్వర్యంలో అనేకమంది మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అయ్యప్ప భక్త జనానికి మధ్యాహ్న భోజనం మరియు రాత్రికి అల్పాహార ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.