Global Vaartha
Date of Publish : 05/11/2026, 7:08 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల రొటేషన్‌పై సుప్రీంకోర్టు ‘నో

  • పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వుడ్‌ నియోజకవర్గాలను రొటేషన్‌ పద్ధతిలో మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది
  • అది చట్టసభల నిర్ణయమే.. కోర్టుల జోక్యం ఉండదని వెల్లడి

పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వుడ్‌ నియోజకవర్గాలను రొటేషన్‌ పద్ధతిలో మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశం పూర్తిగా పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ మోహనలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ జిల్లా ‘కదిపూర్‌’ అసెంబ్లీ స్థానం ఏడు దశాబ్దాలుగా ఎస్సీ రిజర్వుడ్‌ స్థానంగానే కొనసాగడాన్ని సవాల్‌ చేస్తూ జగదీశ్‌సింగ్‌ అనే ఓటరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోటేషన్‌ విధానం లేకపోవడం వల్ల జనరల్‌ కేటగిరీ ఓటర్ల హక్కులు దెబ్బతింటున్నాయని.. పంచాయతీ, మునిసిపాలిటీల్లో లాగే ఇక్కడ కూడా రోటేషన్‌ విధానం తీసుకురావాలని కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save