Date of Publish : 05/11/2026, 7:40 am
Editor : భవ్య జర్నలిస్ట్
హోర్ముజ్‌లో భారత్ నౌకలకు ప్రత్యేక అనుమతి
- హోర్ముజ్ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ.. ఆ జలసంధిలో భారత్ నౌకల రాకపోకలకు ఇరాన్ ప్రత్యేక అనుమతి ఇచ్చింది
హోర్ముజ్ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ.. ఆ జలసంధిలో భారత్ నౌకల రాకపోకలకు ఇరాన్ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అలాగే మన దేశంతో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు ప్రయాణించడానికి అంగీకారం తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో ఆ నాలుగు దేశాల నౌకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ విధాన కమిటీ వైస్ చైర్మన్ హయత్ మొఘద్దమ్ ప్రకటించారు. ఈ దేశాల నౌకలు ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని, అమెరికన్లు కూడా వాటిని అడ్డుకోరని పేర్కొన్నారు. అయితే రాజకీయంగా మద్దతుగా నిలుస్తుందనే ఆలోచనతో చైనా నౌకలకు, మందుల దిగుమతుల కోసం భారత్ నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు విశ్లేషించాయి. ఈ రెండు దేశాలు రవాణా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఎలాంటి రుసుం లేకుండా ఖతార్ నౌకలకు అనుమతి ఇచ్చారని వెల్లడించా
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.