Date of Publish : 05/11/2026, 9:42 am
Editor : భవ్య జర్నలిస్ట్
పోలీసులతో ఎంపీ అవినాష్ రెడ్డి వాగ్వాదం.. పార్నపల్లిలో హైటెన్షన్
- పరిషత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలోని పార్నపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి.. తన అనుచరులతో పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు.
పరిషత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలోని పార్నపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి.. తన అనుచరులతో పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారితో అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.మరో వైపు పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రెండు పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను వారు బలవంతంగా బయటకు తోసేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. వారి సహయంలో మళ్లీ టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారు. స్థానిక పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్ళారు. దీంతో గుండ్లకుంటలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
పులివెందులల్లోని ఆర్ తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వైసీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దాంతో ఆర్ తుమ్మలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.