Global Vaartha
Date of Publish : 05/11/2026, 9:50 am
Editor : భవ్య జర్నలిస్ట్

పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత మాత్రం తగ్గకూడదని కూటమి నేతలు, కేడర్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎన్డీఏ ముఖ్య నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత మాత్రం తగ్గకూడదని కూటమి నేతలు, కేడర్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎన్డీఏ ముఖ్య నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు తదితరులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని వారికి దిశానిర్దేశం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలని కూటమి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేలా ఎవరైనా ప్రయత్నిస్తే వెంటే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని వారికి సూచించారు. గొడ్డలి పార్టీ ఏమైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఓ వేళ ఘర్షణలు చోటు చేసుకుంటే సంయమనం పాటించాలని కూటమి కార్యకర్తలకు సీఎం చంద్రబాబు హితవు పలికారు.

కొనసాగుతున్న పోలింగ్..

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మరో వైపు ఇప్పటికే జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save