Global Vaartha
Date of Publish : 21/10/2026, 3:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మార్కెట్ రూమ్స్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి

కడప నగరంలోని 44వ డివిజన్ పరిధిలోని మార్కెట్ నందు కార్పొరేషన్‌కు చెందిన గదులు కూలిపోయిన ఘటనపై ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి , టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. స్థానిక వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. మార్కెట్ వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే కడప నగర పాలక సంస్థ కమిషనర్ గారితో చర్చించి, అత్యాధునిక వసతులతో కొత్త గదుల నిర్మాణానికి తగిన చర్యలు చేపడతామని అక్కడి వారికి భరోసా కల్పించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save