Global Vaartha
Date of Publish : 05/11/2026, 10:54 am
Editor : భవ్య జర్నలిస్ట్

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..11 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మొత్తం – 2,72

అమరావతి: పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత విడుదల చేసింది.

2,721 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ఈ నెల 11 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

డిసెంబరు 20 నుంచి జనవరి 13 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ మాక్‌టెస్ట్స్ డిసెంబరు 5, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ డిసెంబరు 14 నుంచి చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక 'కీ' విడుదల చేస్తారు.

దీనిపై అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇస్తారు.

మరో వారానికి తుది 'కీ' విడుదల చేస్తారు.

పోస్టుల రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు, హారిజాంటల్ రిజర్వేషన్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

డీఎస్సీ పరీక్షలను సీబీటీ విధానంలో నిర్వహిస్తున్నారు. క్రీడాకోటా అభ్యర్థులకు సైతం రాతపరీక్ష నిర్వహిస్తారు.

యాజమాన్యం | ఖాళీలు

జనరల్ పాఠశాలలు (ఎస్ఏ, ఎస్జీటీ) – 2,111

ప్రత్యేక విద్య (ఎస్ఏ, ఎస్జీటీ) – 350

సొసైటీలు, ఇతర యాజమాన్యాలు (ప్రిన్సిపల్,

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save