Global Vaartha
Date of Publish : 05/11/2026, 10:56 am
Editor : భవ్య జర్నలిస్ట్

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు రూ.50 లక్షల టోకరా.. ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ మోసం

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని నమ్మించి ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.50 లక్షలు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌(81)ను 2026 సెప్టెంబరులో టీ14 బ్లెస్సింగ్‌ గాడెస్‌ లక్ష్మీ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో అనన్య దాస్‌ అనే మహిళ చేర్చింది. అప్‌స్టాక్స్‌ సెక్యూరిటీస్‌ వీఐపీ గ్రూప్‌ పేరుతో ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకుంది. అనంతరం రవికుమార్‌ అనే వ్యక్తి గ్రూప్‌ అనలి్‌స్టగా వ్యవహరిస్తూ బ్లాక్‌ ట్రేడింగ్‌, అప్పర్‌ సర్క్యూట్‌ షేర్లు, ఐపీఓ అలాట్‌మెంట్ల ద్వారా భారీ లాభాలు పొందవచ్చని నమ్మించాడు.నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లో ఖాతా తెరిపించారు. సెప్టెంబరు 24న తొలుత రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితుడికి గ్రూపులోని సభ్యులు భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు చూపించారు. దీంతో నమ్మకం పెంచుకున్న ఆయన పలు విడతల్లో మొత్తం రూ.50 లక్షలను సూచించిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు బదిలీ చేశారు. పెట్టుబడికి రూ.32 లక్షలు లాభాలు వచ్చినట్లు యాప్‌లో కనిపించడంతో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా డబ్బులు రాలేదు. ఆ డబ్బులు తీసుకోవాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి:

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save