Global Vaartha
Date of Publish : 05/11/2026, 11:02 am
Editor : భవ్య జర్నలిస్ట్

రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్

శ్రీ సత్యసాయి జిల్లా : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పరిటాల కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. నసనకోట ప్రభుత్వ పాఠశాలలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ గొడ్డలి పార్టీ వారు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీకి చెందిన కొందరు మాట్లాడటం సబబుకాదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికలలో క్లీన్ స్వీట్ చేయబోతుందని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save