హిందూపురం(అనంతపురం): ఒక వ్యక్తి కలలోనో, సినిమాలోనో కాదు.. నిత్య జీవితంలోనే అరగంట పాటు వెయ్యికోట్లకు అధిపతి అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే జీరో అయ్యా డు. ఈషాకింగ్ ఘటన హిం దూపురంలో జరిగింది. పట్ట ణంలోని సదాశివనగర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారి తోట ఆనంద్‌కు కొటాక్ మహేంద్ర బ్యాంక్‌లో 1147924495 నంబర్‌తో ఖాతా ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం ఆయన ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. తెరిచి చూడగా తన ఖాతాలో డబ్బులు జమ అయినట్లు గుర్తించా డు. తన ఖాతాలో మొదట రూ.32వేలు పైచిలుకు ఉంది. ఆ తరువాత చూసేసరికి వెయ్యికోట్లు జమ అయినట్లు గుర్తించాడు.దీన్ని స్నేహితులకు సైతం చూపించాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే అరగంట లోనే తన ఖాతాలో జీరో చూపించింది. అంతేకాక మొదట తన ఖాతాలో ఉన్న రూ.32వేలకుపైగా నగదుకూడా కనిపించకుండా పోయింది. దీంతో బ్యాంక్ వద్దకు వెళ్లి ఆరాతీశాడు. వారుకూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైంలో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆనంద్ తెలిపారు. ఈ విషయం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.