Global Vaartha
Date of Publish : 05/11/2026, 11:40 am
Editor : భవ్య జర్నలిస్ట్

నువ్వు సూపర్‌ లక్ష్మీ..!

  • సాహస బాలికకు ఎమ్మెల్యే దగ్గుపాటి అభినందన

అనంతపురం క్రైం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు పాఠశాలలో ఉన్మాది నుంచి స్నేహితురాలిని కాపాడటంలో లక్ష్మి చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ప్రశంసించారు. బుధవారం ఆయన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పదోతరగతి విద్యార్థిని లక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై సూపరింటెండెంట్‌, వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని అన్నారు.hdp2.2.jpgవైద్యుల నివేదిక మేరకు మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉన్మాది దాడి నుంచి స్నేహితురాలిని కాపాడేందుకు లక్ష్మి ప్రదర్శించి అసాధారణ ధైర్యం ప్రశంసనీయం అన్నారు. బెంగళూరులో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో బాలిక ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగవుతోందని తెలిపారు. బాలిక ఆరోగ్యం విషయంలో మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save