Global Vaartha
Date of Publish : 05/11/2026, 12:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పెనగలూరులో పెట్రోల్ బాంబుల దాడి ప్రచారం అవాస్తవం: తిరుపతి ఎస్పీ

తిరుపతి : జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా పెద్దగా ఇష్యూస్ ఏమీ లేవన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో ఉదయం పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ కొన్ని వార్తలు, ప్రచారాలు వచ్చాయని.. అయితే అది పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవానికి ఆ ఘటన ఉదయం 6 గంటల కంటే ముందే ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న పెనుగులాట వల్ల జరిగిందని చెప్పుకొచ్చారు.అక్కడ ఉన్న పోస్టర్లను అంటించడం వల్ల దాన్ని పెట్రోల్ బాంబులుగా ప్రచారం చేశారని వివరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకున్నారన్నారు. ఇద్దరి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,600 మంది పోలీసులు విధుల్లో నిమగ్నమై ఉన్నారని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save