Global Vaartha
Date of Publish : 05/11/2026, 1:34 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి

అనంతపురం : ఏపీలో పరిషత్ ఎన్నికలు కొనసాగుతుండగా.. పలు చోట్ల వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైసీపీ మూకల దాడులపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ గొడ్డలిపార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల శ్రీరాములు గ్రామంలోకి అడుగుపెట్టగానే వైసీపీ నేతలు అడ్డుకున్నారు.వైసీపీ నేతలు అడ్డుకోవడంతో మొదలైన గొడవ... ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలేపల్లిలో యథావిధిగా పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ అల్లరి మూకల దాడిలో టీడీపీ అభ్యర్థి సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థి చెన్నకేశవ సోదరుడిపై వైసీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో గాయపడిన మల్లిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ సృష్టిస్తున్న అల్లర్లపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save