- గుంటుపల్లి రైల్వే వాగన్ వర్క్‌షాప్ కాలనీలోని కేంద్రీయ విద్యాలయ-2 పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.
- పోలింగ్ నిర్వహణ తీరు, ఓటర్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
- పోలింగ్ సరళి, ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
- ఇప్పటివరకు 10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.
- ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.