వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శింగనమల మండలం ఎంపీపీ అభ్యర్థిగా మరియు పెరవలి ఎంపీటీసీ అభ్యర్థిగా టి . తిరుపాలమ్మను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నాయకత్వం తెలియజేస్తోంది. ఈ ఎంపికకు సంబంధించి మాజీ మంత్రి శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బొమ్మన శ్రీరామిరెడ్డి,వైకాపా రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ కంచిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముచ్చుకోట శ్రీకాంత్ రెడ్డి, పలువురు వైసిపి నాయకులు తెలియజేశారు. వైసీపీ
పార్టీ తరపున ఎంపీపీ అభ్యర్థిగా పి. తిరుపాలమ్మను ఎంపిక చేయడంతో పెరవలి ఎంపీటీసీ అభ్యర్థి స్థానం మండలంలో వైఎస్సార్‌సీపీ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.