Global Vaartha
Date of Publish : 05/11/2026, 3:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మైక్రోసాఫ్ట్, గూగుల్ తరువాత మెటా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్

ఇంటర్నెట్ డెస్క్: గతంలో లేఆఫ్స్ ప్రకటించిన టెక్ దిగ్గజాలు ప్రస్తుతం వాలంటరీ ఎగ్జిట్‌ల బాట పట్టాయి. స్వచ్ఛందా ఉద్యోగాల్ని వదులుకునే వారికి భారీ పరిహారాలతో కూడిన ఎగ్జిట్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ఈ ఆఫర్‌లు ప్రకటించగా ఈ జాబితాలో తాజాగా మెటా కూడా వచ్చి చేరింది. ఫ్రాన్స్‌లోని ఉద్యోగులకు స్వచ్ఛదంగా తప్పుకునేందుకు వీలుగా వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫ్రాన్స్ మీడియా కథనాల ప్రకారం, దేశంలో మెటాకు 300 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 100 మంది ఈ ఆఫర్ ద్వారా తప్పుకునే అవకాశం ఉంది.గతంలో మైక్రోసాఫ్ట్, గూగుల్‌ కూడా తమ ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్‌లు ప్రకటించాయి. ఈ ఆఫర్‌పై అంతిమంగా ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునేవారు. ఫ్రాన్స్‌లో అక్కడి లేబర్ చట్టాలకు అనుగుణంగా మెటా ముందు అక్కడి కార్మిక సంఘాలతో చర్చించి ఎంతమందిని తొలగించాలనేదానిపై తుది నిర్ణయానికి వస్తుంది.వాలంటరీ ఎగ్జిట్ ద్వారా తప్పుకోవాలనుకునే ఉద్యోగులు ఈ దిశగా ఓ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మెటాకు ప్రపంచవ్యాప్తంగా 66 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లోని వారికీ మెటా ఇదే ఆఫర్‌ను ఇస్తుందా? అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.

ప్రాన్స్ ఉద్యోగులకు సంబంధించి మెటా 2023లో అక్కడి కార్మిక సంఘాలతో తొలగింపులపై ఒప్పందం కుదుర్చుకుంది. స్వచ్ఛందంగా తప్పుకునే ఉద్యోగులకు వారి సర్వీసును బట్టి ఏడాదికి 2 నెలల జీతం చొప్పున పరిహారం లెక్కగట్టి ఇవ్వనుంది. అంతేకాకుండా, 10 నెలల గ్రాస్ శాలరీలో 80 శాతం మొత్తాన్ని మొబిలిటీ లివ్ కింద చెల్లించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా, ఉద్యోగాన్ని వీడిన వారికి నైపుణ్యాల్లో శిక్షణ, కొత్త వ్యాపారాల ప్రారంభానికి సహకారం కూడా అందిస్తుంది. ఇటీవల కాన్వా కూడా వాలంటరీ ఎగ్జిట్ఉద్యోగులకు భారీ పరిహారాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save