Global Vaartha
Date of Publish : 05/11/2026, 3:36 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అక్రమంగా అండాల సేకరణ కేసు.. 22 ఫెర్టిలిటీ సెంటర్లపై పోలీసుల ఆరా

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి సీపీ సుమతి (Malkajgiri CP Sumathi) స్పష్టం చేశారు. నిందితుల దగ్గర హార్మోన్ల ఇంజక్షన్స్ గుర్తించామని, కానీ మహిళలకు వాటిని ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కేసు గురించి కీలక విషయాలను మీడియాకు సీపీ సుమతీ ఈరోజు

 వెల్లడించారు.అండాల డొనేషన్ కోసం ఏఆర్టీ సెంటర్ ద్వారానే ఫెర్టిలిటి సెంటర్‌కు సమాచారం వస్తుందని సీపీ సుమతీ చెప్పుకొచ్చారు. ఏఆర్‌టీ నుంచి అన్నిరకాల డాక్యుమెంట్‌లు సేకరించిన తర్వాత మిగతా ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో మూడు ఆస్పత్రుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మూడు ఫెర్టిలిటి సెంటర్‌లపై సోదాలు చేశామని చెప్పారు. 22 ఫెర్టిలిటీ సెంటర్‌లతో ఏఆర్‌టీ సెంటర్‌లకు లింకులు ఉన్నాయని.. వీటి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు. మహిళలకు పెళ్లి కాకపోయినా జరిగినట్లుగా, భర్త లేకున్నా ఉన్నట్లుగా చెప్పి అండాలను సేకరించారని సీపీ సుమతీ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save