Global Vaartha
Date of Publish : 05/11/2026, 4:08 pm
Editor : భవ్య జర్నలిస్ట్

40 ఏళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి బ్రేక్.. కర్నూలు జిల్లా కడిమెట్లలో ఆసక్తికర పోరు

కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. తొలిసారిగా పోటీ వాతావరణంలో ఎన్నికలు జరగడంతో రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో స్థానికంగా రాజకీయాలు వేడెక్కాయి.ఎర్రకోట, కడిమెట్ల గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. నాలుగు దశాబ్దాల ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి తెరపడటంతో ఈసారి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save