Global Vaartha
Date of Publish : 05/11/2026, 4:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 ఛార్జీ

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ని రోజులూ పూర్తి ఉచితంగా అంబులెన్స్ సేవలందించిన బ్లింకిట్ సంస్థ తమ విధానాలను సవరించింది. ఇకపై ఆ సంస్థ ఎమర్జెన్సీ, నాన్- ఎమర్జెన్సీ కేటగిరీల్లో ఈ సేవలను అందించనుంది. ప్రాణాపాయ స్థితి (Emergency Condition)లో ఉన్న పేషెంట్లకు ఎప్పటిలాగే ఫ్రీ అంబులెన్స్ సదుపాయం కల్పించనుంది. అయితే నాన్- ఎమర్జెన్సీ అవసరాల కోసం అంబులెన్స్ బుక్ చేస్తే మాత్రం రూ.2,500 ఛార్జీ కింద వసూలు చేయనుంది. ఈ విషయాన్ని బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ ఈరోజు  ఎక్స్ వేదికగా వెల్లడించారు.రెండేళ్ల క్రితం ‘పది నిమిషాల్లో అంబులెన్స్’ కాన్సెప్ట్‌తో బింక్లిట్ ఈ రంగంలో ప్రవేశించింది. ఉచితంగా అందులోనూ అత్యంత వేగంగా అంబులెన్స్ సేవలు అందించింది. ఈ క్రమంలో కొందరు నాన్- ఎమర్జెన్సీ అవసరాల కోసం ఈ ఉచిత సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని ఆ సంస్థ గ్రహించింది. రెగ్యులర్ చెకప్స్ కోసం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం కోసం బ్లింకిట్ అంబులెన్స్ బుక్ చేస్తున్నారని గుర్తించింది. అందుకే నాన్- ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500 వసూలు చేయాలని నిర్ణయించిది. అయితే ఎమర్జెన్సీ కండిషన్‌లో మాత్రం అంబులెన్స్ సేవలు పూర్తి ఉచితంగానే ఉంటాయని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save