Global Vaartha
Date of Publish : 21/10/2026, 4:06 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం...

  • విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
  • జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం..
  • పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు కొనసాగుతాయి..

జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ మాట్లాడుతూ...

దేశ సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని రక్షిస్తే, అంతర్గతంగా పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని అన్నారు.

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు తమ కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనూ పోలీసులు ప్రజల భద్రత కోసం విధులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రతకు సంబంధించిన అంశాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంతో తగ్గుదల నమోదైందని తెలిపారు. పోలీసుల సమర్థవంతమైన చర్యలు, నిరంతర కృషి వల్లే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొంటూ జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు జిల్లా కలెక్టర్, న్యాయమూర్తులు, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. గత సంవత్సరం నుంచి నేటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది పేర్లను అదనపు ఎస్పీ అంకిత సురానా ఐపీఎస్ గారు చదివి వినిపించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save