Global Vaartha
Date of Publish : 21/10/2026, 4:12 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎన్నికల విధుల నుంచి కర్నూల్ ఐజీ జిల్లా ఎస్పీని వెంటనే తొలగించాలి.

  • ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్ లు ఆరు రోజుల పాటు కొనసాగించాలి
  • బుధవారం ఉదయం సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి అన్వేష్ ఎ రామ్మోహన్ లు విలేకరుల సమావేశంలో తెలిపారు.

జిల్లాలో జరిగిన మున్సిపల్ నగరపాలక స్థానిక సంస్థ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయకుండా కూటమి పార్టీలు తో కర్నూల్ ఐజీ జిల్లా ఎస్పి పోలీసులు ఉన్నతాధికారులు చేతులు కలిపి ప్రతిపక్ష పార్టీల నామినేషన్లను వేయనీయకుండా వందలమంది రౌడీలు గుండాలు తో అడ్డుకోవడం దౌర్జన్యాలు కు పాల్పడడం పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్వేష్ అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో పోలీసులు ఉన్నత అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గత రెండు పర్యాయాలుగా వైసిపి, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు

ఆ పార్టీలకు పోలీసు అధికారులు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు.

 ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ప్రజలు, ఓటర్లు ఎన్నికల పట్ల విశ్వాసం కోల్పోతున్నారు.

పోలీస్ ఉన్నతాధికారుల వల్లనే ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగటం లేదని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ అధికారులకు ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఇచ్చారు.

 మరుసటి రోజు 21 తేదీ అంటే నేటినుంచి ఎంపీటీసీ, జడ్పిటిసి నామినేషన్లను ఎలా వేస్తారు అన్నారు.

ఎంపీటీసీ ,జడ్పిటిసి అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఓటర్ లిస్ట్ తదితర పొందాలంటే రెవెన్యూ,సచివాల ఉద్యోగులు అందుబాటులో లేకుండా సెలవులు ప్రకటించటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 24 గంటల అభ్యర్థులకు కుల దృవీకరణ పత్రాలు ఇతర సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలియజేశారు.

 కానీ ఆచరణలో అధికారులకు మూడు రోజులు వరుసగా సెలవులు ప్రకటించడం వల్ల ఎంపీటీసీ, జెడ్పిటిసి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాబట్టి నామినేషన్లు కేవలం మూడు రోజులు కాకుండా ఆరు రోజులపాటు కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్ ను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది అని తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save