అనంతరం అమ్మవారి అంతరాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. మరో వైపు నవరాత్రులు చివరి రోజు కావడంతో దుర్గమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలు ఈ రోజుతో ముగుశాయి.