Global Vaartha
Date of Publish : 21/10/2026, 4:39 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పట్టపగలే కౌన్సిలర్ అభ్యర్థి ఇంటి వద్ద బైక్‌కు నిప్పు

  • ఎన్నికల నేపథ్యంలో భయభ్రాంతులకు గురిచేసేందుకే టీడీపీ వర్గీయులు

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పట్టపగలే తీవ్ర ఉద్రిక్తత,చోటుచేసుకుంది.27వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ అనురాధ నివాస ఆవరణలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనం (టూవీలర్ బైక్)పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.​బుధవారం పగటిపూటే ఒక్కసారిగా మంటలు చెలరేగడం గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ,బైక్ తీవ్రంగా దగ్ధమైంది.​ఎన్నికల నేపథ్యంలో తమను భయభ్రాంతులకు గురిచేసేందుకే టీడీపీ వర్గీయులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బాధితులు తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పట్టపగలే ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.కేసు నమోదు చేసుకుని,పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఈ ఘటనతో స్థానికంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save