Editor
11 days ago
విడదల రజిని ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. ▪️ చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ▪️ ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశించిన SEC.. ఘటనపై నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.