05/11/2026, Thursday · 07:25:13 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha
Global Vaartha

This is Short News — best viewed on mobile.

News ePaper
భవ్య జర్నలిస్ట్
Editor
10 days ago

A.B. వెంకటేశ్వరరావుకు మద్దతు తెలుపుతున్న మాజీ మంత్రివర్యులు

విజయవాడ మేయర్ గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి, A.B.వెంకటేశ్వరరావుకు మద్దతు తెలుపుతున్న మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, IAS మాజీ అధికారి డాక్టర్ పివి రమేష్, ఎంసీ దాస్, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, ప్రముఖ విశ్లేషకులు డానీ, శాసనమండలి మాజీ సభ్యులు కె ఎస్ లక్ష్మణరావు, వి లక్ష్మణ రెడ్డి తదితరులు

భవ్య జర్నలిస్ట్
Editor
10 days ago

గంధం వేడుకల్లో పాల్గొన్న సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్

కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన అమిన్ పీర్ పెద్ద దర్గాలో ఘనంగా కొనసాగుతున్న ఉరుసు ఉత్సవాలు.. తొలి రోజు వైభవంగా గంధం మహోత్సవం వేడుకలు.. గంధం వేడుకల్లో పాల్గొన్న సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్

భవ్య జర్నలిస్ట్
Editor
10 days ago

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసులు, బైండోవర్లు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా 255 ఎఫ్ఐఆర్ లు నమోదు 94 మంది అరెస్ట్ 6,180 ఎన్నికల నియమావళి కేసులు 16,299 బైండోవర్లు నమోదు 9,070 ఆయుధాలు స్వాధీనం స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్స్ - 808

భవ్య జర్నలిస్ట్
Editor
10 days ago

బిజెపి అభ్యర్థి రమాదేవి ఏకగ్రీవంగా

19వ వార్డు కూటమి అభ్యర్థి ( బిజెపి ) రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనవేళ డిక్లరేషన్ అందజేస్తున్న ఎన్నికల అధికారి,ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ, నా పై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకులకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసారు

భవ్య జర్నలిస్ట్
Editor
10 days ago

ప్రభుత్వం కొత్త పథకం... Blood_On_Call💥

ఈరోజు నుండి, భారతదేశంలో రక్త అవసరాలకు "104" ప్రత్యేక నంబర్ కానుంది. "Blood_On_Call" అనేది సేవ పేరు. ఈ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత, 40 కిలోమీటర్ల పరిధిలో, నాలుగు గంటల్లోపు, రక్తం డెలివరీ అవుతుంది... 👍 బాటిల్ కు రూ. 450/- మరియు రవాణాకు రూ.100/-

భవ్య జర్నలిస్ట్
Editor
11 days ago

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు

కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ప్రతిపాదిత సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు

భవ్య జర్నలిస్ట్
Editor
11 days ago

విడదల రజిని ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. ▪️ చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు అన్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ▪️ ఎస్సై ప్రియాంకపై విచారణకు ఆదేశించిన SEC.. ఘటనపై నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

భవ్య జర్నలిస్ట్
Editor
11 days ago

ముగిసిన నామినేషన్ల పర్వం

ఎంపీటీసీల్లో టీడీపీ 22,013, వైసీపీ 20,556 ఏపీలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు జడ్పీటీసీల్లో టీడీపీ 2,078, వైసీపీ 1,815, జనసేన 679 శ్రీకాకుళంలో టీడీపీ, వైసీపీ చెరో 1,248; తిరుపతిలో టీడీపీ 1,359, వైసీపీ 1,122

భవ్య జర్నలిస్ట్
Editor
11 days ago

ముంచుకొస్తున్న'అర్ణబ్‌' తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 26 నాటికి తుపానుగా మారే అవకాశం.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు..కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..

భవ్య జర్నలిస్ట్
Editor
12 days ago

వెంకట శివ నామినేషన్

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించిన రీ నామినేషన్లలో భాగంగా కడప కలెక్టరేట్ సభా భవన్ లో శుక్రవారం కడప నగరపాలక సంస్థ 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిపిఐ కడప నగర కార్యదర్శి యన్ వెంకట శివ.