05/11/2026, Thursday · 10:25:23 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం..

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 10:16 AM వైఎస్సార్ కడప 1

కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం..
Want this news as a newspaper clip?Print News Clip

కడప : పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందుల పార్నపల్లిలో అనుచరులతో కలిసి కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి పోలింగ్ కేందం వద్ద హల్‌చల్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అవినాశ్ వాగ్వాదానికి దిగారు. దీంతో పార్నపల్లిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

గుండ్లకుంటలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

మరో వైపు పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రెండు పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తోసేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. వారి సహయంలో మళ్లీ టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారు. స్థానిక పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్ళారు. దీంతో గుండ్లకుంటలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తుమ్మలపల్లిలో ఘర్షణ..

పులివెందుల సమీపంలోని ఆర్ తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వైసీపీ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దాంతో ఆర్ తుమ్మలపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Kadapa districtAvinashaltercationpoliceParnapalli

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

748 Posts

Latest News

ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి కానుక.. డెస్క్‌లపై స్మార్ట్‌ఫోన్లు.. వీడియో వైరల్ శబరిమలకు టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మున్సిపల్ ఫలితాలే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు బాలుడి దత్తత కేసులో మరల ట్విస్ట్ - జిల్లా కలెక్టర్ హైకోర్టులో రిట్ పిటిషన్ పోలీసులతో ఎంపీ అవినాష్ రెడ్డి వాగ్వాదం.. పార్నపల్లిలో హైటెన్షన్ హోర్ముజ్‌లో భారత్‌ నౌకలకు ప్రత్యేక అనుమతి మా వాళ్ల కోసం..వాసుదేవరెడ్డికి సిఫారసు చేశా..! దేశంలో విద్యుత్‌ నిల్వకు ఊతం