బాలుడి దత్తత కేసులో మరల ట్విస్ట్ - జిల్లా కలెక్టర్ హైకోర్టులో రిట్ పిటిషన్

- బాలుడి దత్తత కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
సీడబ్ల్యూసీ (CWC - చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) నిబంధనలను, అధికారులు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలించకుండానే బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కలెక్టర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేవలం హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నంత మాత్రాన అది చట్టబద్ధమైన దత్తత కాదని వాదించారు.
స్టే కోరిన అధికారులు:
అప్పీల్ పరిష్కారమయ్యే వరకు బాలుడిని తగిన రక్షణ సంరక్షణలో ఉంచాలని, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని (స్టే విధించాలని) కోరారు.
నేపథ్యం:
మూడేళ్లుగా తాము పెంచుకుంటున్న బాలుడిని చట్టపరమైన నిబంధనలు లేవనే కారణంతో అధికారులు శిశు సంరక్షణ కేంద్రానికి తరలించగా, పెంపుడు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలతో బాలుడు ఇటీవల వారి వద్దకు చేరినప్పటికీ, కలెక్టర్ తాజాగా వేసిన పిటిషన్‌తో ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












