05/11/2026, Thursday · 08:00:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

క్రైస్తవులపై దాడులు, చర్చిల కూల్చివేతలు, తప్పుడు కేసులను అరికట్టాలి!

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 6:54 AM వైఎస్సార్ కడప 3

క్రైస్తవులపై దాడులు, చర్చిల కూల్చివేతలు, తప్పుడు కేసులను అరికట్టాలి!
Want this news as a newspaper clip?Print News Clip
  • చర్చిల మరమ్మతులకు రూ.3 లక్షలు కేటాయించాలి
  • ప్రతి గ్రామంలో క్రైస్తవ శ్మశానవాటికకు స్థలం ఇవ్వాలి
  • పాస్టర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి.
  • క్రైస్తవుల సమస్యలపై గవర్నర్లకు వినతి పత్రం అందించిన డాక్టర్ కోలా ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, క్రైస్తవులపై జరుగుతున్నట్లు దాడులు, చర్చిల కూల్చివేతలు, ప్రార్థనా మందిరాలపై దాడులు, క్రైస్తవులపై ఫిర్యాదులు నమోదవుతున్నాయని ఆరోపిస్తున్న తప్పుడు కేసులు తదితర అంశాలపై యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్ నేతృత్వంలో క్రైస్తవ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా తగిన చర్యలు చేపట్టేలా చూడాలని కోరడం జరిగిందన్నారు.క్రైస్తవులపై దాడులను అరికట్టాలిరాష్ట్రంలో క్రైస్తవులు, పాస్టర్లు, మతపెద్దలపై జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న దాడులపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆయనకు తెలిపారు. క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలి కోరడం జరిగిందన్నారు.
చర్చిలు, ప్రార్థనా మందిరాల కూల్చివేతలను అరికట్టాలి,చర్చిలు, ప్రార్థనా మందిరాలపై దాడులు, చట్టవిరుద్ధమైన కూల్చివేతలను నిరోధించాలి అని , ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వివాదాల్లో చట్టబద్ధమైన విధానాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి కోరడం జరిగిందన్నారు.
క్రైస్తవులపై తప్పుడు కేసులను నిరోధించాలి అని,చర్చిల మరమ్మతులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించాలి కోరడం జరిగిందన్నారు.రాష్ట్రంలోని మరమ్మతులు అవసరమైన చర్చిలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో చర్చికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలి తెలపడం జరిగిందన్నారు.ప్రతి గ్రామంలో క్రైస్తవ శ్మశానవాటికకు స్థలం కేటాయించాలి అని,క్రైస్తవుల అంత్యక్రియల నిర్వహణకు అనేక ప్రాంతాల్లో స్థల సమస్యలు ఎదురవుతున్నందున, ప్రతి గ్రామంలో క్రైస్తవ శ్మశానవాటిక కోసం తగిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలి అని. ఇప్పటికే ఉన్న శ్మశానవాటికలను ఆక్రమణల నుంచి పరిరక్షించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి అని కోరడం జరిగిందన్నారు.పాస్టర్ల గౌరవ వేతనం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచాలి అని కోరడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ, సమానత్వం, భద్రత హక్కులుపరిరక్షించబడాలికోరడంజరిగిందన్నారు.క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, చట్టపరమైన మార్గాల్లో పోరాటం చేయడం జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

stop attacksChristiansdemolitionchurchesfalsecases

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News