05/11/2026, Thursday · 08:00:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్.. పలు చోట్ల కూటమి ఆధిక్యం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 10:55 AM రాష్ట్ర వార్తలు 11

ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్.. పలు చోట్ల కూటమి ఆధిక్యం
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ‘కూటమి’ దూసుకుపోతోంది.అమలాపురం, తుని మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్‌లో జనసేన ముందంజలో కొనసాగుతుండగా.. జగ్గయ్యపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీ, చిత్తూరు, విశాఖ కార్పొరేషన్ల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్‌లో ఉంది. దానితోపాటు ధర్మవరం, వెంకటగిరి, పెనుకొండ మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ మిగతా పార్టీలను వెనుకకునెట్టి ముందంజలో కొనసాగుతోంది. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆధిక్యాన్ని కనబరుస్తుండగా.. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

kutami adhikyamutkamthagasagutunnaennikalakaumtimgpaluchotla

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News