05/11/2026, Thursday · 07:22:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. టీడీపీ మేయర్ అభ్యర్థికి భారీ మెజారిటీ..

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 5:31 PM విశాఖపట్నం 18

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. టీడీపీ మేయర్ అభ్యర్థికి భారీ మెజారిటీ..
Want this news as a newspaper clip?Print News Clip

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై ఏకంగా 1,19,683 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు లెక్కించిన 4,36,676 ఓట్లలో టీడీపీకి 2,56,881 ఓట్లు, వైసీపీకి 1,37,194 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ 5,434 ఓట్లు, ఇతరులు 37,163 ఓట్లు వచ్చాయి.విశాఖపట్నంలోని మొత్తం 120 డివిజన్లలో ఇప్పటివరకు 42 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 27, జనసేన 10, బీజేపీ 5 డివిజన్లలో విజయం సాధించాయి. వైసీపీ 4, ఇతరులు 2 డివిజన్లలో గెలుపొందారు. మరో 24 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాలతో విశాఖపట్నం నగరంలో కూటమి బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

ముఖ్యంగా మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి లభిస్తున్న భారీ ఆధిక్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మిగిలిన డివిజన్ల ఫలితాలు వెలువడే కొద్దీ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూటమి బలం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

TDP candidateMookuSravaniVisakhapatnamMunicipalElectionssecuredvotes

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News