05/11/2026, Thursday · 07:25:21 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

భవ్య జర్నలిస్ట్ 04/11/2026 9:18 AM రాష్ట్ర వార్తలు 28

ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే
Want this news as a newspaper clip?Print News Clip

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పురపాలక సంఘాలన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే అనంతపురం కార్పొరేషన్‌ మాత్రం వైసీపీ ఖాతాలో పడింది.

ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

కార్పొరేషన్‌ మాత్రం వైసీపీ పరం       ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పురపాలక సంఘాలన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే అనంతపురం కార్పొరేషన్‌ మాత్రం వైసీపీ ఖాతాలో పడింది. ఆ పార్టీ అభ్యర్థి చిట్లూరు రమేశ్‌గౌడ్‌ విజయం సాధించారు. అయితే ఇక్కడి 62 వార్డులకు గాను టీడీపీ 31, జనసేన 6, బీజేపీ 1 (మొత్తం 38) మెజారిటీ వార్డులు దక్కించుకున్నాయి. వైసీపీ 20 మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ కూటమి పార్టీల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇక శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి చైర్మన్‌గా జనసేన అభ్యర్థి మేకల ఈశ్వర్‌ గెలిచారు.

మడకశిర నగర పంచాయతీలో జనసేన అభ్యర్థి గుండుమల శారద, పెనుకొండలో టీడీపీ అభ్యర్థి త్రివేంద్రమూర్తి, హిందూపురంలో టీడీపీ అభ్యర్థి పురిడి మంజునాథ్‌, కదిరిలో టీడీపీ అభ్యర్థి షేక్‌ ఆర్షియా బాను, ధర్మవరంలో టీడీపీ అభ్యర్థి పరిశె సుధాకర్‌ గెలుపొందారు. అనంతపురం జిల్లా గుత్తి చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన గోవిందరాజుల తమిళసెల్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి ఆర్‌.యశోద గౌడ్‌, కల్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి బుట్నా లక్ష్మి, రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి టెంకశాల హనుమంతు, తాడిపత్రిలో టీడీపీకే చెందిన రేష్మా పర్వీన్‌ చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. గుత్తిలోని మొత్తం 32 వార్డులూ కూటమికే దక్కాయి.

వీటిలో 29 టీడీపీకి, జనసేనకు 2, బీజేపీకి ఒకటి దక్కాయి. గుంతకల్లు వార్డుల్లో వైసీపీ గట్టి పోటీయే ఇచ్చింది. 48 వార్డులకు గాను 15 దాని ఖాతాలో పడ్డాయి. టీడీపీ 24, బీజేపీ 1 గెలుచుకున్నాయి. 8 మంది స్వతంత్రులు గెలిచారు. తాడిపత్రిలోని 48 వార్డులూ కూటమికే దక్కాయి. వైసీపీకి ఒక్కటి కూడా రాలేదు. కదిరి, మడకశిర, పెనుకొండల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు.

ఇదీ చదవండి :: విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. టీడీపీ మేయర్ అభ్యర్థికి భారీ మెజారిటీ..

Ananta MunicipalitiesJointmeet

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News