05/11/2026, Thursday · 07:23:22 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 4:47 PM ఏలూరు 14

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Want this news as a newspaper clip?Print News Clip

చైర్‌పర్సన్‌గా రొంగల అనూష ఘన విజయం

7,503 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపు

32 వార్డుల్లో 27 స్థానాలు కూటమి ఖాతాలోకి

గ్లోబల్ వార్త- ఏలూరు : రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు పలు ప్రాంతాల్లో విజయభేరి మోగిస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన టీడీపీ నాయకురాలు రొంగల అనూష ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మేక సత్యవతిపై 7,503 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, వెలువడిన ఫలితాల్లో కూటమి అభ్యర్థులు 27 వార్డులను కైవసం చేసుకున్నారు. ఇందులో టీడీపీ 20 వార్డుల్లో విజయం సాధించగా, జనసేన ఆరు, బీజేపీ ఒక వార్డులో గెలుపొందాయి. వైఎస్సార్‌సీపీ మూడు వార్డుల్లో విజయం సాధించగా, మరో రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. దీంతో మున్సిపాలిటీలో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రొంగల అనూష భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ విజయం సాధించిన అభ్యర్థులు, వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోతున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

TDP KaivasamJangareddygudemMunicipality

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News