వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. తాజాగా చింతకొమ్మదిన్నె మండలం తాడిగోట్ల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీ గూటికి చేరాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహా రెడ్డి మరియు ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలన పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే














