కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తున్న ఉల్లి

- పెరుగుతున్న ధర
- మధ్యతరగతికి భారం
హైదరాబాద్: ఉల్లి ఘాటెక్కుతోంది. కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి లేకుండా ఏ కూర కూడా వండలేని పరిస్థితి. కిలో ఉల్లిగడ్డ రూ. 60నుంచి రూ. 70లకు కొనాలంటే మధ్యతర గతి ప్రజలకు భారంగా మారింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఉల్లిగడ్డ ధర పెరుగుతుండడంతో పేద ప్రజలు కొనలేదని పరిస్థితి నెలకొంది. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఏ వస్తువు కొనాలన్న భారంగా మారింది. రైతుబజార్లలో ఉల్లి గడ్డ ధర కిలో రూ. 40ఉండడంతో ఫలకనుమా, గౌలిపురా, లాల్ దర్వాజ, చాంద్రాయణగుట్ట బహిరంగ మార్కెట్లలో రూ. 50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నా రు. దీంతో ఉల్లిగడ్డ కొనాలంటేనే మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. చిన్న సైజ్, నాణ్యత తక్కువ ఉన్న గడ్డను రూ. 50 నుంచి రూ.55కు విక్రయించగా, పెద్ద సైజ్ ఉల్లి గడ్డను రూ. 60కి విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












