05/11/2026, Thursday · 08:00:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు.. స్పందించవద్దు..

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 4:23 PM వైఎస్సార్ కడప 13

సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు.. స్పందించవద్దు..
Want this news as a newspaper clip?Print News Clip

* ప్రజలను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప : సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ వారి పేరుతో.. పేక్ అకౌంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు.. తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పుడు మెసేజీలకు ఎవరూ స్పందించవద్దని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలను హెచ్చరించారు.

తాజాగా.. తన పేరుతో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా.. డబ్బులు అడుగుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి ఫేక్ అకౌంట్ల రిక్వెస్టులకు ఎవరూ కూడా స్పందించ వద్దని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మెసేజీలు ఎవరికైనా వస్తే.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయాలని ఆయన తెలిపారు. సైబర్ నేరాలపై జిల్లా సైబర్ పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని.. నేరాలకు పాల్పడే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

money requestsrespondsocialmedia

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News