పీ-4 మోడలే సుస్థిరాభివృద్థికి మూలం

- ‘నాంది’ ఫౌండేషన్ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
- ఆనంద్ మహీంద్ర పోస్టుపై సీఎం చంద్రబాబు
‘నాంది’ ఫౌండేషన్ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 28 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన సేవా ప్రయాణం వెనుక ఉన్న అసలైన ఉద్దేశాన్ని ఈ పోస్టు మరోసారి గుర్తు చేసిందని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘దివంగత డాక్టర్ కె.అంజిరెడ్డితో కలిసి 28 ఏళ్ల క్రితం నాంది ఫౌండేషన్ను ప్రారంభించాం. పీ-4 మోడలే సుస్థిరాభివృద్థికి మూలం’ అని చంద్రబాబు వివరించారు. డాక్టర్ అంజిరెడ్డి ఆశయాలను ఆనంద్ మహీంద్ర, మనోజ్కుమార్తోపాటు ఫౌండేషన్ బృందం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుండటం తనకు ఎంతో గర్వ కారణంగా ఉందన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












