05/11/2026, Thursday · 08:00:39 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కాబోయే టీచర్లకు కొత్త బాధ్యతలు!

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 10:33 AM రాష్ట్ర వార్తలు 13

కాబోయే టీచర్లకు కొత్త బాధ్యతలు!
Want this news as a newspaper clip?Print News Clip

డిగ్రీ రావాలంటే కొందరికి అక్షరజ్ఞానం నేర్పాల్సిందే.

రెండేళ్ల కోర్సులో వారు ఐదుగురిని తీర్చిదిద్దాలి/

సామాజిక బాధ్యతగా టీచింగ్ వృత్తి.

తాజా మార్గదర్శకాలను సిద్ధం చేసిన ఎన్సీటీఈ

ఉపాధ్యాయ విద్యలో చేరినవారికి కేంద్ర విద్యా శాఖ కొత్త బాధ్యతలు అప్పగించింది.

ఉపా ధ్యాయ విద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసుకుని పట్టా చేత పట్టుకుని వెళ్లాలంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలని సూచించింది.

పట్టా పొందాలంటే కనీసం ఐదు గురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాల్సిందేనని తేల్చిచెప్పింది.

కేవలం తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకోవడం,

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే ఉపాధ్యాయ విద్యకు సరిపోదని,

సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనలోనూ భవిష్యత్ ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో (టీఈఐ) చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా అక్షరాస్యత కార్య క్రమాల్లో పాల్గొనేలా కేంద్ర విద్యాశాఖ రూపొందించిన 32 పేజీల మార్గదర్శకాలను జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) అందు బాటులోకి తెచ్చింది.

ఉల్లాస్ - నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

జాతీయ స్థాయిలో ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థు లందరికీ ఈ నిబంధనలు అమలుకానున్నాయి.

దేశవ్యాప్తంగా 15,509 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఉండగా, వాటిలో 17,84,326 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ), డీఎ ల్ఎడ్, బీపీఈడీ, బీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సులను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి...

కోర్సును బట్టి బాధ్యతలు...

విద్యార్థి ఉపాధ్యాయులు ఎంతమందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే విషయాన్ని వారు అభ్యసిస్తున్న కోర్సు కాలవ్యవధిని బట్టి నిర్ణయించారు.

రెండేళ్ల ఉపాధ్యాయ కోర్సు విద్యార్థులు కనీసం ఐదుగురికి అక్షరజ్ఞానం నేర్పాలి.

మూడేళ్లకోర్సు విద్యార్థులు కనీసం ఆరుగురిని, నాలుగేళ్ల కోర్సు విద్యార్థులు కనీసం ఎనిమిది మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

కేవలం బోధన చేయడంతో ఈ బాధ్యత పూర్తయినట్లు కాదు...

తాము బోధించిన అభ్యాసకులు పునాది అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞాన మూల్యాంకన పరీక్ష(ఎఫ్ఎల్ఎన్ఎటీ)కు హాజరై ఉత్తీర్ణులై, ఉల్లాస్ కార్యక్రమం కింద అక్షరాస్యులుగా ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.

అప్పుడే సంబంధిత విద్యార్థి ఉపాధ్యాయులకు గ్రేడ్లు కేటాయిస్తారు.

అంటే విద్యార్థులు ఎంతమందికి పాఠాలు చెప్పారు అనే దానికంటే,వారిలో ఎంత మంది అక్షరాస్యులయ్యారన్నదే కీలకం.

పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల సహకారం

ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయ విద్యా సంస్థలు స్థానిక పాఠశాలలు,

స్థానిక సంస్థలు,

స్వచ్చంద సంస్థలు,

సమాజసేవా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది.

నిరక్షరాస్యులను గుర్తించడం, వారికి బోధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం,

మూల్యాంకన పరీక్షలకు హాజరయ్యేలా చూడటం వంటి బాధ్యతలను సమన్వయంతో నిర్వహించాల్సి ఉంటుంది.

విద్యార్థి ఉపాధ్యాయులు తాము గుర్తించిన నిరక్షరాస్యుల వివరాలతో ప్రత్యేక రికార్డును నిర్వహించాలి.

వారికి బోధించిన విధానం,

నేర్చుకునే క్రమంలో సాధించిన పురోగతి,

 బోధనా అనుభవాలు,

అభ్యాసకుల అభివృద్ధికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలి.

తమ బోధనా అనుభవాలపై ప్రతిబింబ నివేదికను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయ విద్య... సామాజిక బాధ్యత...

2022-23లో ప్రారంభమైన ఉల్లాస్ కార్యక్రమం దేశంలో వయోజన అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతోంది.

ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ విద్యతో అనుసంధానించడం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు దోహదపడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా పనిచేయబోయే వారిలో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే దిశగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది.

దీంతో ఉపాధ్యాయ విద్యార్థులకు ఇకపై కళాశాల తరగతి గదులతో పాటు సమాజంలోనూ పాఠాలు చెప్పాల్సిన బాధ్యత ఏర్పడనుంది.

ఉపాధ్యాయ పట్టా సాధించడానికి విద్యా ప్రమాణాలతో పాటు సామాజిక అక్షరాస్యత సాధన కూడా తప్పనిసరి అర్హతగా మారనున్నది..

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

kotta badhyatalukaboyeticharlaku

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News