05/11/2026, Thursday · 07:21:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జాతీయ సెలక్టర్లపై సర్ఫరాజ్ ఖాన్ అసహనం!

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 5:06 PM క్రీడలు 11

జాతీయ సెలక్టర్లపై సర్ఫరాజ్ ఖాన్ అసహనం!
Want this news as a newspaper clip?Print News Clip

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ బీసీసీఐ సెలక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు. ఫిట్‌‌గా ఉండటంతో పాటు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నప్పటికీ.. టీమిండియా టెస్ట్ జట్టులో తిరిగి ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మంచి ప్రదర్శన చేసినా.. సెలక్టర్లు గుర్తించకపోతే...తాను ఎవరి కోసం కష్టపడాలి? అంటూ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి కోసమే కష్టపడుతున్నానని, లేకపోతే క్రికెట్‌ను ఎప్పుడో వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు.దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీతో రాణించాడు. ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం సర్ఫరాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. 'రోజూ ఉదయం లేవగానే నన్ను నేనే ప్రశ్నించుకుంటా. నేను ఎందుకు శ్రమించాలి? ఎవరి కోసం కష్టపడాలి? ప్రాక్టీస్ కోసం ఉదయం 5 గంటలకే ఎందుకు నిద్ర లేవాలి? నేను ఇప్పటికే భారత్‌కు ప్రాతినిథ్యం వహించాను. గతంలో లావుగా ఉన్నానని అందరూ హేళన చేయడంతో ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టి 22 కిలోలు తగ్గాను. కానీ నేను లావుగా ఉన్నప్పుడే బాగా ఆడానని తిరిగి ఆటపట్టిస్తున్నారు. కానీ నేను వీటిని పట్టించుకోను' అని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు.

'సాధారణ ప్రదర్శనతోనే ముంబై జట్టులో కొనసాగగలను. కానీ నా తండ్రి నౌషాద్ పడిన కష్టం చూసినప్పుడు.. ఆయన కోసం మైదానంలోకి వెళ్లి బాగా రాణించాలనిపిస్తోంది. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. కేవలం నా క్రికెట్‌పై దృష్టి పెడుతున్నాను. ఒకవేళ జాతీయ సెలక్టర్లు పిలిస్తే.. టీమిండియా తరఫున ఆడుతాను. లేకపోతే దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతాను' అని సర్ఫరాజ్ ఖాన్ స్పష్టం చేశాడు. మరోవైపు భారత్ తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం ఉంది. అలానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 66 మ్యాచ్‌లు ఆడి.. 18 శతకాలతో 5354 పరుగులు చేశాడు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Khan intolerantSarfaraznationalselectors

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News