05/11/2026, Thursday · 08:00:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 9:10 PM రాష్ట్ర వార్తలు 25

ఆ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
Want this news as a newspaper clip?Print News Clip
  • అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితులు విధించింది.

 అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై వచ్చే ఫ్రీహోల్డ్ దరఖాస్తుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించిన ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితులు విధించింది. ఆర్డీవో పరిధిలో దరఖాస్తులకు 60 రోజుల్లో పరిష్కారం చూపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్దిష్ట కేటగిరీ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని నిర్దేశించింది. అలాగే తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి 60 రోజుల సమయం తీసుకొవచ్చని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 659 జారీ చేసింది.కాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన రోజే తహసీల్దార్ లాగిన్‌కు చేరేలా ప్రభుత్వం సాంకేతిక మార్పులు తీసుకొచ్చింది. వెబ్‌ల్యాండ్‌లో ఫ్రీహోల్డ్ నమోదైన వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని చెప్పింది. ఇందుకోసం ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్ సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వెబ్‌ల్యాండ్ వివరాలు రికార్డుల్లో భద్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

freehold applicationsDeadlinedisposallandGovernmentOrders

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News