05/11/2026, Thursday · 08:00:39 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జిల్లా కోర్ట్/ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప న్యాయ విభాగము:

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 4:43 PM వైఎస్సార్ కడప 13

జిల్లా కోర్ట్/ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప న్యాయ విభాగము:
Want this news as a newspaper clip?Print News Clip

చిలమకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఎర్రగుంట్ల ఎంపీడీఓ ఆఫీస్ నందు కమ్యూనిటీ మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.”

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా గౌరవ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయధికారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప జి .రామ గోపాల్ వారి సూచనల మేరకు గౌరవ ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు అవగాహన/న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా సెక్రటరీ గారు మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వారి గ్రామాలలో ఉండే వక్తులను కమ్యూనిటీ మీడియేటర్స్ ను నియమించడము జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలు, కుటుంబ సమస్యలు, భూ సంబంధిత వివాదాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతర సామాజిక సమస్యలను పరస్పర చర్చలు, అవగాహన, సయోధ్య ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని వివరించడం జరిగింది. కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులకు వెళ్లకుండానే స్థానిక స్థాయిలోనే వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా కావడమే కాకుండా ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, సామాజిక ఐక్యత పెంపొందుతాయని తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. శాశ్వత లోక అదాలత్, జాతీయ లోక్ అదాలత్, ఎల్.యస్.యు.సి, ఎల్.యస్.యు.యం మొదలగు అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఏవైనా సమస్యలుంటే కమలాపురం మండల న్యాయ సేవా సమితిని మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కడప ను సంప్రదించవచ్చును అన్నారు.

శిక్షణ పొందిన కమ్యూనిటీ మధ్యవర్తులు ఎన్. సురేష్ నాయుడు, కె. నవీన్ కుమార్, మరియు కె. అనిల్ కుమార్ రెడ్డి సర్టిఫికెట్స్ ను గౌరవ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప శ్రీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ గారు మరియు గౌరవ చైర్మన్ కం జూనియర్ సివిల్ జడ్జి, కమలాపురం శ్రీ ఎస్.మధు సుధన్ రావు వారు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు ఏ. సుబ్రమణ్యం వి. రాజా గోపాల్ రెడ్డి మరియు సి. గురవయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ పి. మనోహర్ ఆర్. ఎస్. రవి తేజ, గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Judicial DivisionDistrictCourtServiceAuthorityCuddapah

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News