05/11/2026, Thursday · 08:00:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 6:39 AM వైఎస్సార్ కడప 23

పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం
Want this news as a newspaper clip?Print News Clip

ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం jntu కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.తమ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్న దానిపై ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయం సాధించిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.మొత్తంగా పులివెందుల ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో, వెలువడనున్న ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ennikala kaumtimgpulivemdulamunsipalsarvamsiddham

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News