05/11/2026, Thursday · 07:25:22 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నీట్ పీజీ ప్రవేశాల్లో ర్యాంకుల ఆధారంగా సీట్లు! .. 2027 నుంచి అమలుకు ప్రతిపాదన

భవ్య జర్నలిస్ట్ 04/11/2026 10:12 AM రాష్ట్ర వార్తలు 10

నీట్ పీజీ ప్రవేశాల్లో ర్యాంకుల ఆధారంగా సీట్లు! .. 2027 నుంచి అమలుకు ప్రతిపాదన
Want this news as a newspaper clip?Print News Clip
  • నీట్‌ పీజీ, నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు 2027 నుంచి కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఆ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సంటైల్‌ ఆధారిత అర్హత విధానానికి బదులుగా ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని 12 మంది సభ్యులతో కూడిన కమిటీ సిఫారసు చేసింది.

 నీట్‌ పీజీ, నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు 2027 నుంచి కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఆ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సంటైల్‌ ఆధారిత అర్హత విధానానికి బదులుగా ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని 12 మంది సభ్యులతో కూడిన కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు తాను రూపొందించిన నివేదికను ఆ కమిటీ ఈనెల 3న సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆ ప్రతిపాదనకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2027 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించినప్పటికీ, ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది.పీజీ మెడిసిన్‌లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు కనీస అర్హత ప్రమాణాలను తగ్గించడం సరికాదని కమిటీ స్పష్టం చేసింది. సీట్లు మిగిలిపోతున్నాయన్న ఒకేఒక్క కారణంతో ప్రవేశ అర్హత ప్రమాణాలకు పూర్తిగా రిలాక్సేషన్ ఇవ్వడం సరికాదని సూచించింది. అలాగే నాన్‌ క్లినికల్‌ పీజీ కోర్సుల ఫీజులను తగ్గించాలని, ప్రీ క్లినికల్‌, పారాక్లినికల్‌ విభాగాలను ఎంచుకునే అభ్యర్థులకు సర్వీస్‌ బాండ్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. కౌన్సెలింగ్‌లో జాప్యాన్ని నివారించడంతోపాటు, పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ నివేదికపై తమ అభిప్రాయాలను సమర్పించేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఏంటీ వివాదం?
కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పీజీ మెడికల్ సీట్లు భారీగా మిగిలిపోతుండటంతో నీట్‌ పీజీ అర్హత కటాఫ్‌ను పలుమార్లు తగ్గించడంతో వివాదం మొదలైంది. 2023లో అన్ని కేటగిరిల అభ్యర్థులకు అర్హత పర్సంటైల్‌ను సున్నాకు తగ్గించారు. దీంతో నెగెటివ్‌ మార్కులు వచ్చిన వారికి కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. 2024లోనూ కటాఫ్‌ తగ్గించారు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 15 పర్సంటైల్‌, రిజర్వ్‌డ్‌ కేటగిరిలకు 10 పర్సంటైల్‌గా నిర్ణయించారు. 2025-26 ప్రవేశాల సమయంలోనూ ఇదే పరిస్థితి వచ్చింది. 2026 జనవరి 13న నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) మూడో విడత నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ కోసం అర్హత కటాఫ్‌ను సవరించింది.
జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 50 పర్సంటైల్‌ నుంచి 7 పర్సంటైల్‌కు, జనరల్‌ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్‌ నుంచి 5 పర్సంటైల్‌కు తగ్గించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌ నుంచి సున్నాకు కుదించింది. దీంతో నెగెటివ్‌ మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనే అర్హత లభించింది. పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కటాఫ్‌ తగ్గింపు కారణంగా అదనంగా 95,913 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. అయితే, అర్హత ప్రమాణాలను ఇంత భారీగా తగ్గించడం వల్ల వైద్యవిద్య నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ప్రవేశాల విధానంపై సమగ్ర సమీక్ష చేపట్టారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Seats basedranksNEETadmissionsProposalimplemented

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News