05/11/2026, Thursday · 07:25:24 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విజయవాడ, విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 3:37 PM రాష్ట్ర వార్తలు 13

విజయవాడ, విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : విజయవాడ, విశాఖపట్నం (జీవీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణకై మేయర్, సభ్యులకు నవంబర్ 4న ఆయా జిల్లాల కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటీసులు అందజేయనున్నారు. నవంబర్ 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.ఏవైనా కారణాల వల్ల నవంబర్ 9న ఎన్నిక జరగకపోతే, సెలవు రోజు అయినప్పటికీ మరుసటి రోజు నవంబర్ 10 ఉదయం 11 గంటలకు ఎన్నికను నిర్వహించనున్నారు. నవంబర్ 10న కూడా ఎన్నిక సాధ్యపడకపోతే, తదుపరి తేదీ ఖరారు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

ennikalaku notiphikeshanvijayavadavishakhadipyutimeyar

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News