05/11/2026, Thursday · 08:33:16 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హోర్ముజ్‌లో భారత్‌ నౌకలకు ప్రత్యేక అనుమతి

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 7:40 AM జాతీయం 1

హోర్ముజ్‌లో భారత్‌ నౌకలకు ప్రత్యేక అనుమతి
Want this news as a newspaper clip?Print News Clip
  • హోర్ముజ్‌ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ.. ఆ జలసంధిలో భారత్‌ నౌకల రాకపోకలకు ఇరాన్‌ ప్రత్యేక అనుమతి ఇచ్చింది

హోర్ముజ్‌ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ.. ఆ జలసంధిలో భారత్‌ నౌకల రాకపోకలకు ఇరాన్‌ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అలాగే మన దేశంతో పాటు చైనా, ఇరాక్‌, ఖతార్‌ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు ప్రయాణించడానికి అంగీకారం తెలిపింది. హోర్ముజ్‌ జలసంధిలో ఆ నాలుగు దేశాల నౌకలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఇరాన్‌ పార్లమెంట్‌ జాతీయ భద్రత, విదేశీ విధాన కమిటీ వైస్‌ చైర్మన్‌ హయత్‌ మొఘద్దమ్‌ ప్రకటించారు. ఈ దేశాల నౌకలు ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని, అమెరికన్లు కూడా వాటిని అడ్డుకోరని పేర్కొన్నారు. అయితే రాజకీయంగా మద్దతుగా నిలుస్తుందనే ఆలోచనతో చైనా నౌకలకు, మందుల దిగుమతుల కోసం భారత్‌ నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇచ్చినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు విశ్లేషించాయి. ఈ రెండు దేశాలు రవాణా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఎలాంటి రుసుం లేకుండా ఖతార్‌ నౌకలకు అనుమతి ఇచ్చారని వెల్లడించా

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Special permissionIndianvesselsHormuz

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News