05/11/2026, Thursday · 07:21:18 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సీఎం రేవంత్ సమీక్ష.. ముంపు భూములకు పరిహారంపై స్పష్టత

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 5:45 PM హైదరాబాద్ 10

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సీఎం రేవంత్ సమీక్ష.. ముంపు భూములకు పరిహారంపై స్పష్టత
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్: తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. ప్రాజెక్టు పురోగతి, మహారాష్ట్రతో సమన్వయం, ముంపు సమస్యలు, పరిహారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కీలక పత్రాలను ఆ రాష్ట్ర అధికారులకు అందజేయాలని రేవంత్ స్పష్టం చేశారు. అలాగే, ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. పరిహారం చెల్లింపుల కోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో అందుబాటులో ఉంచుతామని రేవంత్ స్పష్టం చేశారు. ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సర్వే ప్రక్రియకు అవసరమైన సహకారం అందించాలని, మహారాష్ట్ర అధికారులకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అందించాలని అధికారులను ఆజ్ఞాపించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజ్ విషయంలో అంతర్రాష్ట్ర సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తూ, మహారాష్ట్రతో చర్చలను నిరంతరం కొనసాగించాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై స్పష్టతతో ముందుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో తుమ్మిడిహట్టి బ్యారేజ్ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రతో చర్చలు, ముంపు భూముల సర్వే, పరిహారం చెల్లింపు అంశాలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

barrage ClarificationRevanthreviewsThummidihatticompensationdrowninglands

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News