05/11/2026, Thursday · 08:03:01 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పత్తికి ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తగ్గిన దిగుబడి.. పెరిగిన ఖర్చులు

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 11:52 AM కరీంనగర్ 12

పత్తికి ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తగ్గిన దిగుబడి.. పెరిగిన ఖర్చులు
Want this news as a newspaper clip?Print News Clip
  • రైతు సంఘాల డిమాండ్‌
  • ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్న రైతులు
  • వర్షాభావంతో తగ్గిన దిగుబడి
  • మార్కెట్లలో తగ్గిన పత్తి అమ్మకాలు

వరంగల్‌: ఎల్‌నినో ఎఫెక్టుతో ఈ సంవత్సరం పత్తి ది గుబడి తగ్గింది. సాగు ఖర్చు విపరీతంగా పెరిగింది. మద్దతు ధర మాత్రం రూ.8500ల నుంచి రూ.9160 ల వద్దే కొట్టుమిట్టాడుతోంది. దీంతో రైతులు పత్తి అమ్మడానికి వెనుకంజ వేస్తున్నారు. గిట్టుబాటు ధర క్వింటాకు రూ.12వేలు కావాలని కోరుతున్నారు. అదే విషయాన్ని రైతు సంఘాలు సైతం ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి క్వింటాకు రూ.12 వేలు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సీసీఐ చేత పత్తి కమర్షియల్‌ కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

వర్షాభావంతో తగ్గిన దిగుబడి

ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఎల్‌నీనో ఎఫెక్టుతో వర్షా లు సకాలంలో కురువక, నీటి వనరులు అందుబా టులో లేక పంటల దిగుబడి చాల వరకు తగ్గిపోయింది. ముఖ్యంగా పత్తి ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5- 7 క్వింటా ళ్లకు పడిపోయింది. మరోవైపు సాగు ఖర్చులు ఎక రానికి రూ.50 వేల వరకు పెరగడంతో రైతుల పరి స్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. పెట్టిన పెట్టిన పెట్టుబడికి, చేసిన కష్టానికి నష్టం రాకుండా ఉండాలంటే రూ.12 వేలు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

మార్కెట్లలో తగ్గిన పత్తి అమ్మకాలు

ఈ సీజన్‌లో పత్తి దిగుబడి తక్కువగా రావడం.. మార్కెట్లలో ధరలు తగ్గడంతో రైతులు మంచి ధర వచ్చినప్పుడే అమ్ముకుందామని ఎదురు చూస్తున్నా రు. ఫలితంగా దాదాపుగా అన్ని మార్కెట్లలో పత్తి అమ్మకాలు తగ్గిపోయాయి.

గిట్టుబాటు ధర కోసం ఎదురు చూపులు

తొందరపడి పంటను అమ్ముకుంటే నష్టమే తప్ప లాభం లేదని గ్రహించిన రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారు. తప్పనిసరి అయితే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సీసీఐ చేత కమర్షియల్‌ కొనుగోళ్లు చేపట్టాలని, రూ.12 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం రూ.1000లు బోనస్‌ ప్రకటించాలి..

సదానందం, రైతు, గీసుగొండ మండలం

రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటకు మద్దతు ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు సహకారంగా క్వింటాకు వెయ్యి రూపాయల చొప్పున బోనస్‌ అందించి ఆదుకోవాలి. అప్పుడే రైతులకు నష్టాలు తగ్గి పంట సాగుకు ముందుకు వస్తారు.

పత్తికి 12 వేలు ఇవ్వాల్సిందే..

మంద సంజీవ, రైతు, చెన్నారం, వర్ధన్నపేట

ప్రస్తుత కరువు పరిస్థితు ల్లో పంట దిగుబడి తగ్గింది. పెట్టుబడి పెరిగింది. ఈ నేపథ్యంలో రైతుకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే పత్తికి క్వింటాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్‌ ప్యాకేజీ కింద తీసుకుని పత్తి రైతులను ఆదుకోవాలి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

perigina kharchulupattikielninoephekttagginadigubadi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News