05/11/2026, Thursday · 07:22:33 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 3:45 PM జాతీయం 9

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియా అపరకుబేరుల్లో నెం.1గా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, 88 బిలియన్ డాలర్ల పైచిలుకు సంపదతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్‌ను అధిగమించి టాప్ పొజిషన్‌లోకి వచ్చారు. జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్ నేపథ్యంలో సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 10.02 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన నికర సంపద విలువ 8 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఒక్క రోజులో అత్యధిక సంపద వృద్ధి నమోదు చేసిన వారిలో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా ఆసియాలో నెం.1 స్థానంలోకి దూసుకెళ్లారు.

ఆసియా బిలియనీర్లలో రెండో స్థానంలో ఉన్న జాంగ్ యిమింగ్ నికర సంపద 84 బిలియన్ డాలర్లు. ఇక అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 79.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఆయన నికర సంపద విలువ 878.5 బిలియన్ డాలర్లు. 366 బిలియన్ డాలర్ల నికర సంపదతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో నిలిచిన గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద విలువ 232.2 బిలియన్ డాలర్లు.

ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ లిస్టు ప్రకారం, రోజువారి సంపద అభివృద్ధిలో కూడా మస్క్ సోమవారం తొలి స్థానంలో నిలిచారు. సోమవారం ఆయన నికర సంపద 10 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఆ తరువాతి స్థానంలో ముఖేశ్ అంబానీ ఉండగా మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న బెజోస్ సంపద 4.7 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇక రోజువారీ అత్యధికంగా నష్టపోయిన వారిలో ఒరాకిల్ కోఫౌండర్ లారీ ఎల్లిసన్ నిలిచారు. నిన్న ఆయన సంపద విలువ 11.9 బిలియన్‌ల మేర తగ్గింది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Mukesh AmbaniAsiarichestman

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

739 Posts

Latest News