05/11/2026, Thursday · 08:34:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తాడిపత్రిలో జేసీ అరాచకం.. నిత్యం భయమే!

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 11:18 AM అనంతపురము 11

తాడిపత్రిలో జేసీ అరాచకం.. నిత్యం భయమే!
Want this news as a newspaper clip?Print News Clip

అనంతపురం: ప్రతిరోజు దాడులు.. దౌర్జన్యాలు.. బెదిరింపులు నిత్యకృత్యంగా మారాయి. ఫ్యాక్షన్‌ వద్దంటూ నీతులు చెప్పే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అదే ఫ్యాక్షన్‌ను తట్టి మరీ నిద్రలేపుతున్నాడు. తాడిపత్రి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా చిత్రీకరించడంలో జేసీ సఫలీకృతమయ్యాడు. గంజాయి, బ్లేడ్‌బ్యాచ్, రౌడీ షిటర్లను వెంటేసుకుని తిరుగుతూ ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు ఉసిగొల్పుతున్నాడు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి రేపుతుండడంతో జేసీ గూండా పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారు.

అప్రజాస్వామికంగా 30 వార్డుల ఏకగ్రీవం

తాడిపత్రి మునిసిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. నామినేషన్‌ కేంద్రాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి పచ్చ మూకలతో అష్టదిగ్బంధం చేయడంతో 11, 14, 32, 33, 45 వార్డులకు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ వేయలేకపోయారు. మిగిలిన 43 వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే..నామినేషన్ల స్రూ్కటినీలో అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ కొన్నింటిని చించేసి నామినేషన్లు తిరస్కరించారంటే జేసీ బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికార బలానికి గూండాలు, రౌడీలు తోడవ్వడంతో పాటు అధికారుల సహకారం ఉండడంతో తాడి పత్రిలో 30 వార్డులను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది.

తీవ్ర భయాందోళనలో అభ్యర్థులు

తాడిపత్రిలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానంతో పాటు 18 వార్డుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డుల్లోనూ ప్రచారం చేసుకునేందుకు అభ్యర్థులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు సజావుగా జరిగితే జేసీ ఆగడాలు సాగవన్న ఉద్దేశంతో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అలజడి సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ రౌడీ మూకలు నడుచుకుంటున్నాయి.

వందల సంఖ్యలో రౌడీలు

రెండున్నరేళ్లుగా తాడిపత్రి నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో దిగజారిపోయాయి. తాడిపత్రిలో 27 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఊరుకునేది లేదంటూ జేసీ బహిరంగంగానే హెచ్చరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. జేసీ తన వెంట వందల సంఖ్యలో రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను వెంటేసుకుని తిరుగుతూ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులకు ఉసిగొల్పుతున్నాడు.

ఆదివారం కూడా ఇదే తంతు

ఈ నెల 25న ఆదివారం గన్నేవారిపల్లికాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పాల్గొంట్టార్రా మీరు.. అంటూ జేసీ అనుచరులు రాళ్లదాడి చేశారు. వందల మంది గుంపులుగా వచ్చి వైఎస్సార్‌ సీపీ నేత ప్రదీప్‌రెడ్డి ఇంటిపై పడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ముందే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడులకు దిగారు. జేసీ అనుచరుల ఆగడాలపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఎన్ని ఫిర్యాదులు ఇస్తున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

స్థానిక ఎన్నికల నాటి నుంచి దాడులు ఇలా..

= ఈ నెల 15న తాడిపత్రి పట్టణంలోని శాస్త్రి నగర్‌లో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ ఇంటి వద్దకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ బెదిరించారు.

= నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన 17వ తేదీనే నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ కార్యదర్శి కేశవరెడ్డిని, పార్టీ నేత పేరం అమర్‌నాథరెడ్డిని రూరల్‌ సీఐ నారాయణరెడ్డి బలవంతంగా పంపించివేయడంలో జేసీ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

= 18వ తేదీ వందలాది మంది గూండాలు, వీధి రౌడీలు సీఐ ఆరోహణరావు సమక్షంలోనే రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేసి 14, 32, 33, 45 వార్డులకు వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు.

= ఈ నెల 18వ తేదీన 24వ వార్డు అభ్యర్థి కొట్ల షఫీ ఇంటిపై దాడి చేసి, ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఒకటో వార్డు అభ్యర్థి మహమ్మద్‌ జాఫర్‌ సోదరుడు మాబాషాను కిడ్నాప్‌ చేశారు.

= ఈ నెల 25న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేశారు. అదే రోజు సాయంత్రం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు షేక్షావలి, ప్రకాష్‌ లపై దాడికి దిగి తీవ్రంగా గాయపరిచారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Forever FearJayceeAnarchyTadipatri

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News